నవతెలంగాణ-తలకొండపల్లి
మీ రుణం ఎప్పటికీ మర్చిపోము ఎమ్మెల్యే సార్ అని తాండవాసు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని లింగారావుపల్లి గ్రామపంచాయతీ లోని లింగారావుపల్లి తాండవాసులోని గత కొన్ని రోజులుగా త్రాగునీటి లేక తాండవాసులకు ఇబ్బంది ఏర్పడడం జరిగింది. ఈ విషయం తండావాసులు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టి కి తీసుకెళ్లి వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో బోర్ డ్రిల్లింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తాండ వాసులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్య, మాజీ ఉప సర్పంచ్ మణికంఠ, నాయకులు యాదయ్య, జేలందర్ రెడ్డి, జంగయ్య, సాయిలు, చంద్రశేఖర్,జంగయ్య, శేఖర్, ప్రవీణ్ కుమార్ గౌడ్, అంజయ్య, రబ్బానీ, లాల్యా,జమిలి, దేవి, రాములు, రుక్మిణీ తదితరులు పాల్గొన్నారు.
మీ రుణం ఎప్పటికీ మర్చిపోము ఎమ్మెల్యే సార్
- Advertisement -
- Advertisement -

                                    

