Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబనకచర్లతో రాష్ట్రానికి నష్టం జరగనివ్వం

బనకచర్లతో రాష్ట్రానికి నష్టం జరగనివ్వం

- Advertisement -

– మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ
నవతెలంగాణ-షాద్‌నగర్‌ రూరల్‌

బనకచర్ల ప్రాజెక్ట్‌ విషయంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో సోమవారం పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో స్పష్టంగా వివరించినట్టు చెప్పారు. ఈ విషయంలో కేంద్రానికి కూడా స్పష్టత ఉందన్నారు. ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమ్మదనం గ్రామంలో శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామంలో అమ్మకు వందనం పేరుతో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో ప్రతి ఇంటికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి రామ్‌ భూపాల్‌గౌడ్‌, నాయకులు అందే బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, చెంది మహేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌, పి.అశోక్‌, చెట్ల వెంకటేష్‌. మోహన్త సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad