- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. హైదరాబాద్ లో న్యాయనిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణకు రావాల్సిన నీటివాటలో ఒక్క చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదు. SEPT 23-25 వరకు ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో నేనే స్వయంగా పాల్గొనబోతున్నా’ అని తెలిపారు.
- Advertisement -