- Advertisement -
- కరీంనగర్ జిల్లా సాధన జేఏసీ కమిటి తీర్మానం
నవతెలంగాణ-బెజ్జంకి: శాసనసభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని..మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేవరకు విశ్రమించమని కరీంనగర్ జిల్లా సాధన జేఏసీ కమిటీ సభ్యులు తీర్మానం చేసుకున్నారు.సోమవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు కరీంనగర్ జిల్లా సాధన జేఏసీ కమిటి సభ్యులు సమావేశం నిర్వహించారు.మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేవరకు చేపట్టాల్సిన కార్యచరణపై జేఏసీ కమిటీ చర్చించుకున్నట్టు సభ్యులు తెలిపారు.
ఇచ్చిన హామీపై డ్రామాలాడోద్దు: దీటీ బాలనర్స్
శాసనసభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్న ఇచ్చిన హామీపై డ్రామాలాడోద్దని..మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపిన తర్వాతే ఎమ్మెల్యే మండలంలో పర్యటించాలని ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు, దాచారం గ్రామ ఉప సర్పంచ్ దీటీ బాలనర్ఫ్ డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బాలనర్స్ ప్రభుత్వానికి సూచించారు.
- Advertisement -


