Wednesday, December 10, 2025
E-PAPER
Homeజిల్లాలుతుంగతుర్తిలో హత్యా రాజకీయాలను స‌హించం: కేటీఆర్

తుంగతుర్తిలో హత్యా రాజకీయాలను స‌హించం: కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు,” అని కేటీఆర్ హెచ్చరించారు.

ఈ ఘటన తెలిసిన వెంటనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌లతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. “పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరూ అధైర్య పడవద్దు. మరణించిన కార్యకర్త కుటుంబానికి, గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుంది,” అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -