నవతెలంగాణ-హైదరాబాద్: పాక్ దాడిలో దెబ్బతిన్న ఇండ్లను పునర్ నిర్మిస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్ అన్నారు. అందుకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం తరుపున అందజేస్తామని బాధితులకు చెప్పారు. బుధవారం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సలామాబాద్, లాగామా, బందీ, గింగల్ సహా ఉరీలోని షెల్లింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఉరీ ప్రాంతంలోని ప్రజలు అనేకసార్లు బాధను భరించారని.. అయితే, ప్రతిసారి ఎంతో ధైర్యంతో తిరిగి కోలుకున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. బాధితులందరికీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పాక్ లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. కానీ సరిహద్దు ప్రాంతంలోని సామాన్య పౌరుల నివాసాలనే లక్ష్యంగా పాకిస్థాన్ భీకర దాడులకు తెగించింది. ఈ దాడుల్లో పలు ఇండ్లు ధ్వంసమైయ్యాయి. ఈక్రమంలో జమ్మూ సీఎం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ..బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.
