– మన డ్రోన్లు, క్షిపణులతో పాక్‌కు నిద్రపట్టలేదు
– అణు బ్లాక్‌మెయిలింగ్‌ను సహించం
– ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని
– గోప్యంగా సాగిన పర్యటన
జలంధర్: మన డ్రోన్లు, క్షిపణుల సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యా నించారు. పాక్ సైన్యం, నౌకాదళం, డ్రోన్లు, క్షిపణులు మన సైనిక దళాల ముందు నిలవలేకపోయాయని ఆయన చెప్పారు. మన డ్రోన్లు, క్షిపణులు ఉగ్రవాద లక్ష్యాలను ఛేదిస్తుంటే శత్రువులకు భారత్ మాతా కీ జై అని వినిపించిందని అన్నారు. పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా ఇక ఉగ్రవాదులకు ఎంత మాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదులను వారి ఇళ్ల లోనే హతమార్చగలం. వారు బతికి బట్టకట్టేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వం’ అని అన్నారు. మోడీ మంగళ వారం ఉదయం ఆదంపూర్ వైమా నిక స్థావరాన్ని సందర్శించారు. త్రివిధ దళాలు, బీఎస్‌ఎఫ్ ప్రదర్శిం చిన ధైర్య సాహసాలను ప్రశంసిం చారు. తాను సోమవారం ఆవిష్క రించిన మూడు సూత్రాల సిద్ధాం తాన్ని పునరుద్ఘాటిస్తూ అణు బ్లాక్ మెయిలింగ్‌ను భారత్ సహించబోదని తేల్చి చెప్పారు. వైమానిక దళ సామర్ధ్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని, అది చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వైమానిక దళ సిబ్బంది ప్రధానికి వివరించారు. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మన వైమానిక స్థావరాలు, రక్షణ దళ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మోడీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మానవ శక్తి, యంత్ర శక్తి మధ్య మన సైన్యం గొప్ప సమన్వయం సాధించిందని, సాంకేతికత ను వ్యూహంతో అనుసంధా నించిందని తెలిపారు. భారత వైమానిక దళం పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొనిపోయి ఉగ్రవాద లక్ష్యాలను ఛేదించిందని మోడీ అన్నారు. దీంతో పాకిస్తాన్ దిగ్భ్రాంతిచెం ది అచేతనురాలైందని వ్యాఖ్యానించారు. మన దళాల వద్ద ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞా నం అందుబా టులో ఉన్నదని, సంక్లిష్టమైన అత్యాధునిక వ్యవస్థలను ఎలా ఉపయోగించాలో భారత్‌కు బాగా తెలుసని చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాద చర్యలకు పూనుకుంటే భారత్ తనదైన పద్ధతిలో, తనదైన మార్గంలో గట్టిగానే సమాధా నం ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని సైనికులతో ముచ్చటించారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో మోడీకి వారు స్వాగతం పలికారు. పంజాబ్‌లోని జలంధర్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఆదంపూర్ వైమానిక స్థావరం ఉంది.
పర్యటన అనంతరం మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆ వివరాలను పోస్ట్ చేశారు. ‘ఈ రోజు ఉదయం నేను ఆదంపూ ర్‌లోని వైమానిక దళ కేంద్రానికి (ఎఎఫ్‌ఎస్)కు వెళ్లాను. మన వైమానిక యుద్ధ వీరులు, సైనికులను కలిశాను. ధైర్యసాహసాలు, దృఢదీక్ష, నిర్భయత్వం ప్రదర్శిం చిన దళాలను కల వడం నాకు ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చిం ది. మన దేశం కోసం ఎంతో చేసిన సాయుధ దళాలకు జాతి యావత్తూ కృతజ్ఞతలు తెలుపుతోంది’ అని అన్నారు. మోడీ ఉదయం 6.15 గంటలకు ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారని, సుమారు 50 నిమిషాల పాటు అక్కడ గడిపి వైమానిక దళ సిబ్బందితో, సాయుధ దళాల సీనియర్ అధికారులతో ముచ్చటించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై వారి నుండి సమాచారాన్ని, వారి అభిప్రాయాలను మోడీ తెలుసుకున్నారు.
ప్రధాని ఆదంపూర్ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు. జిల్లా పౌర, పోలీసు అధికారులెవ్వరినీ అనుమతించలేదు. అసలు ప్రధాని వస్తున్నారన్న సమాచారం కూడా వారికి తెలియదు. ప్రధాని పర్యటనకు సంబంధించిన 13 సెకండ్ల వీడియోను పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ఇదిలావుండగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనిక దళాల అధి పతులకు సమావేశ మయ్యారు. త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), రక్షణ కార్యదర్శి హాజరయ్యారు.
పలు విమాన సర్వీసులు రద్దు
జమ్ము, అమృతసర్, చండీఘర్, లెహ్, శ్రీనగర్, రాజ్‌కోట్ నుండి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం రద్దు చేశాయి. తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ విమానయాన సంస్థలు వేర్వేరు ప్రకటనలలో తెలియజేశాయి. భుజ్, జామ్‌నగర్ వెళ్లే విమాన సర్వీసులను కూడా ఎయిర్ ఇండియా రద్దు చేసింది.
ఉగ్రవాదం అంతు చూస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES