Saturday, June 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు అండ‌గా ఉంటాం: పుతిన్

ఇరాన్‌కు అండ‌గా ఉంటాం: పుతిన్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్ అణు ఆయుధాలు అధికంగా క‌లిగి ఉంద‌నే సాకుతో ఇజ్రాయిల్ ఆదేశంపై దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అణ్వాయుధ తయారీకి ఇరాన్‌ సన్నాహాలు చేస్తోందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరుదేశాల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు పలుమార్లు స్పష్టం చేశామని పుతిన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప‌శ్చిమాసియా ఉద్రిక‌త్త‌లు త‌గ్గించ‌డానికి ఇరాన్‌-ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -