Tuesday, October 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రమోద్ కుటుంబానికి అండ‌గా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రమోద్ కుటుంబానికి అండ‌గా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ వ్యాప్తంగా 194 మంది తెలంగాణాలో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోటీ రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇస్తామమని ప్రకటించారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

బలిమెలలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాజులరామారంలో 200 గజాల స్థలాన్ని ఇస్తున్నామని ప్రకటించించారు. ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని.. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగనీయకుండా చూశారని తెలిపారు. నేరం చేస్తే తప్పించుకోలేరు అన్న నమకాన్ని, ప్రజలు విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్న సహించి వద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

కానిస్టేబుల్ నుంచి ఏఎస్ ఐలకు కోటి రూపాయలు, ఎస్‌ఐ నుంచి సీఐల వరకు రూ. కోటి 25 లక్షలు, డీఎస్పీ నుంచి ఎస్పీ వరకు రూ.కోటిన్నర, ఆ పై స్థాయి అధికారులకు రెండు కోట్లు రూపాయలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నాం.” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -