నవతెలంగాణ-హైదరాబాద్: బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు తాళలేక ఆ కాలేజీ విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకుంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విద్యార్థినికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బుధవారం లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ బుధవారం ఉదయం ఆత్మాహుతి చేసుకుని మరణించిన విద్యార్థిని తండ్రితో మాట్లాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఒడిశాలోని బాలాసోర్‌లో న్యాయం కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతురాలైన కుమార్తె తండ్రితో నేను మాట్లాడాను. ఆయన గొంతులో, ఆయన కుమార్తె బాధ, కలలు, పోరాటం నాకు అర్థమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆ తండ్రికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చాను. జరిగిన ఘటన అమానవీయం. ఈ ఘటన మొత్తానికి సమాజానికి తగిలిన గాయం’ అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
బాలాసోర్ మృతురాలికి అండగా ఉంటాం: రాహుల్‌గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES