– ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్ : భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండలంలోని బెజగం చెరువు తండా, నాగిరెడ్డిపేట్ పటేల్ చెరువు, లింగంపేట మండలంలోని పోల్కంపేట్ కన్నాపూర్ లింగంపల్లి గ్రామాలలో పంట పొలాలను, కట్టలు తెగిన చెరువులను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులకు గండిపడి పంట పొలాల్లోకి ఇసుకమేటలు వేయడం జరిగిందని ఆయన అన్నారు. తక్షణ చర్యలుగా 10 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మత్తులు చేయడం జరిగిందని శాశ్వత పరిష్కారానికి కావలసినంత నిధులు తీసుకురావడం జరుగుతుందని ఆయన అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకి గతంలో పదివేల నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని అంతకంటే ఎక్కువగానే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా పంట పొలాల్లో ఇసుక మేటలు తీయడానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ఎవరు కూడా అధైర్య పడకూడదని ఆయన అన్నారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కూతురు బ్రిడ్జి పనులు కోటి రూపాయలతో తాత్కాలిక పనులు రెండు రోజులు ప్రారంభమవుతావని శాశ్వత పనుల కొరకు 6.5 కోట్లు మంజూరి కావడం జరిగిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఆర్డీడిఓ పార్థ సింహారెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాగూర్, మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, కోఆర్డినేటర్ నరహారెడ్డి, మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కోరపతి శేఖర్, సుధాకర్, సాయ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES