నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న రాజకీయ అస్థిరత, ఘర్షణల నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి జస్టిస్ సుశీల కర్కీతో ఫోన్‍లో సంభాషించారు. ఈ సందర్భంగా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకు భారత్ సంపూర్ణంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నేపాల్‌లో ఇటీవలి కాలంలో రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంపై నిరసనకారులు తీవ్ర ఆందోళనలకు దిగారు. జెన్ జడ్ అనే నిరసనకారుల బృందం మొదట శాంతియుతంగా తమ నిరసనలను ప్రారంభించింది. దేశంలో ప్రజాగ్రహం పెరగడంతో అప్పటి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. జెన్ జడ్ ప్రతినిధుల బృందం నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును ప్రతిపాదించింది. దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలతోపాటు తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. లోకల్ న్యూస్ రాసిన అనుభవం ఆమెకు ఉంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వార్తలు సైతం ఆమె రాశారు. జ్యోతికి జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆమె ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా తదితర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. జ్యోతి ఈజేఎస్ నుంచి జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు…. ఇంకా చదవండి