Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాలసదరం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం…

బాలసదరం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం…

- Advertisement -

– జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : బాలసదనం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి 40 విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించారు. భువనగిరి జిల్లాకు చెందిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు అందిస్తూ జిల్లాలో ఉన్న బాలసదనం మన సమస్యలతో అస్తవ్యస్తంగా ఉందని సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తిని అందించారు. బీబీనగర్ మండలం మహాదేవపూర్ కు చెందిన వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ శివారెడ్డి దరఖాస్తు అందిస్తూ ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని భక్తుల రాకకు కెమికల్ కంపెనీ విడుదల చేసే నీరు, గాలి అసౌకర్యం కలిగిస్తున్నాయని తగు చర్యలు తీసుకోవాలని ఆలయ చైర్మన్ శివారెడ్డి తో పాటు ప్రభాకర్, స్వామి రెడ్డి, ఆంజనేయులు, పద్మా రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అఖిల్, రాములు విజ్ఞాపన అందజేశారు. మోట కొండూరు మండలం సింగారం గ్రామానికి చెందిన పన్నాల  అనూష దరఖాస్తు అందిస్తూ సర్వే నెంబర్లు 215/1, 215/5, 212/1, 214/1, 214/4 లలో 14 ఎకరాల భూమి ఉందని, సర్వే కొరకు చాలానా కూడా కట్టి నాలుగు సంవత్సరంల అయిందని ఆయన ఇప్పటివరకు సర్వే చేయడానికి రావడం లేదన్నారు.
పోచంపల్లి మండలం జిబ్లగ్  పల్లి కి చెందిన సయ్యద్ సుల్తానా భర్త చాంద్ పాషా తన దరఖాస్తు అందిస్తూ  ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినా ముగ్గు పోయడానికి రాలేదని తమకు కారణాలు తెలియవని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన ఎడ్ల నరసమ్మ దరఖాస్తు అందిస్తూ తనకు అర్హత ఉన్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పర్యవేక్షించాలని, వెంటనే సమాధానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈవో శోభారాణి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని సునంద, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad