Saturday, May 24, 2025
Homeతాజా వార్తలురైతాంగాన్ని కాపాడుకునేందుకు సమిష్టిగా పనిచేస్తాం..

రైతాంగాన్ని కాపాడుకునేందుకు సమిష్టిగా పనిచేస్తాం..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చలు జరిగాయి. విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనం ఏపీఎస్సీఎస్సీఎల్ కు కేటాయించబడింది. ప్రస్తుతం ఈ భవనంలోని 2వ, 3వ, 4వ, 5వ అంతస్తులను తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ అద్దెకు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించగా, ఈ అద్దె ఒప్పందంపై ఇరుపార్టీల మధ్య ఇవాళ MOUపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రైతాంగాన్ని కాపాడుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -