Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్పద్మశాలి అభివృద్ధికి కృషి చేస్తాం

పద్మశాలి అభివృద్ధికి కృషి చేస్తాం

- Advertisement -
  • నూతన పాలకవర్గాలకు ఘన సన్మానం
    నవతెలంగాణ-తంగళ్ళపల్లి:
    పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తామని పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల, తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మి రాజం అన్నారు. మండలంలోని పద్మనగర్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మోర శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం నూతనంగా ఎన్నికైన పంచాయితీ పాలకవర్గాలకు ఘన సన్మానం చేశారు. పద్మ నగర్ సర్పంచ్ మోర నిర్మల, ఉప సర్పంచ్ వేముల శ్రీకాంత్, తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం, తోపాటు వార్డు సభ్యులను శాలువాతో కుల బాంధవులందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలీలు రాజకీయంగా ఎదగడమే కాకుండా, సమాజంలో పద్మశాలీలు మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట శ్రీహరి, ఉపాధ్యక్షులు కందికట్ల ప్రభాకర్,కోశాధికారి సామల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఉడుత సంతోష్, తేల బాల నారాయణ, వేముల మల్లేశం, అనాల్దాస్ నారాయణ, చంద్రశేఖర్,దేవేందర్ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -