నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హిమంత బిశ్వశర్మ క్షమాపణలు చెప్పినా వదిలిపెట్టమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిమంతను దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎంగా విమర్శించారు. రాష్ట్రంలో ద్వేష రాజకీయాలు పెరిగాయని, బీజేపీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
‘‘అస్సాంకు చెందిన దివంగత గాయకుడు జుబిన్ గర్గ్.. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన జీవితాంతం కృషి చేశారు. ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. మా పార్టీ భావజాలం కూడా అలాంటిదే. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే మా సిద్ధాంతం. మేం అధికారంలోకి వస్తే.. జుబిన్ మృతి కేసులో నిందితులను 100 రోజుల్లోగా శిక్షిస్తాం’’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా ఇస్తామని, తేయాకు కూలీలకు రోజుకు రూ.450 చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సారీ చెప్పినా సీఎంను వదిలిపెట్టం: రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



