Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండభవన నిర్మాణ సంక్షేమబోర్డును ఇన్సూరెన్స్‌రంగానికి అప్పజెప్పే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

భవన నిర్మాణ సంక్షేమబోర్డును ఇన్సూరెన్స్‌రంగానికి అప్పజెప్పే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-చండూరు
భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్‌ రంగానికి అప్పజెప్పే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఏఐ టీయూసీ తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు దోటి వెంకన్న కోరారు. ఆదివారం చండూరులోని మాదగోని నర్సింహా భవనంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ యూనియన్‌ మండలకమిటీ సమావేశం భూతరాజు శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షే మబోర్డును ఇన్సూరెన్స్‌ రంగాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేయడం బాధాకరమని తెలిపారు. 2009 నుంచి మన రాష్ట్రంలో లేబర్‌ డిపార్ట్మెంట్‌ ద్వారా కార్మికులకు పథకాలు అందుతున్నాయని, ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా బీమా రంగానికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భవన నిర్మాణ సంక్షేమబోర్డు ద్వారా చెల్లిస్తున్న డబ్బులు లేబర్‌ డిపార్ట్మెంట్‌ చేతులు దులుపుకొని బీమా కంపెనీకి అప్పజెప్పడంలో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.బీమా కంపెనీలకు అప్పజెప్పడం అంటే సంక్షేమబోర్డు ఎత్తి వేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు.ఈనెల నాలుగో తేదీన గుట్టు చప్పుడు కాకుండా సంక్షేమబోర్డు వారు ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి టెండర్‌ కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేశారని పేర్కొన్నారు.ఈ నెల17న హైదరాబాదులోని లేబర్‌ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు జెల్లా శ్రీను, ఏఐటీయూసీ బిల్డింగ్‌ అండ్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు భూతరాజు శ్రీను, ప్రధానకార్యదర్శి చందా మదనయ్య, ఎలవర్తి లింగయ్య, పేర్ల గురుస్వామి, నకిరేకంటి శ్రీను, పోలే యాదయ్య, పర్సన బోయినశివ, దాసరియాదగిరి, ఇరిగిశంకర్‌, ఈదులకంటి యాదయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad