Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆటలునేపాల్‌తో వెస్టిండీస్‌ ఢీ

నేపాల్‌తో వెస్టిండీస్‌ ఢీ

- Advertisement -

– సెప్టెంబర్‌లో 3 మ్యాచుల టీ20 సిరీస్‌
న్యూఢిల్లీ: టీ20 క్రికెట్‌ అగ్రజట్టు వెస్టిండీస్‌.. పసికూన నేపాల్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడనుంది. సెప్టెంబర్‌ 27న తొలి టీ20తో ఆరంభం కానున్న సిరీస్‌కు యుఏఈ వేదికగా నిలువనుంది. నేపాల్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగనున్న తొలి ద్వైపాక్షిక సిరీస్‌ ఇదే కావటం విశేషం. ఈ ఏడాది ఆఖర్లో టీ20 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్‌లో పోటీపడనున్న నేపాల్‌కు కరీబియన్లతో సిరీస్‌ ఉపయుక్తంగా ఉండనుంది. ఈ సిరీస్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌లుగా కాకుండా.. గ్లోబల్‌ క్రికెట్‌ వృద్దికి సెలబ్రేషన్‌గా చూడాలని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో క్రిస్‌ అన్నారు. సెప్టెంబర్‌ 27, 28, 30న షార్జాలో మూడు టీ20 మ్యాచులు షెడ్యూల్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad