నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్-8 పోరులో వెస్ట్ండీస్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకుగాను 8 వికెట్లు 176 పరుగులు చేసింది. హోల్డర్(49), సేఫార్డ్(52) సముచిత ఇన్నింగ్ ఆడి దక్షిణాఫ్రికా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు.
అయితే తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకొని, వెస్ట్ండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వెస్టిండీస్ ఓపెనర్లు నుంచి ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఎస్‌డీ హోప్ (16), హిట్ మేయర్(2) ఒకే ఓవర్లో ఔట్ అయ్యారు. రెండో ఓవర్లో రెండో బంతికి హోప్ ఔట్ కాగా, అదే ఓవర్లో ఐదో బాల్‌కి హిట్ మేయర్ పెవిలియన్ చేరాడు. వారి నిష్కమణతో క్రీజులో వచ్చిన బీఏ కింగ్(21) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. మూడో ఓవర్లో మూడో బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ చేజ్(2) కూడా ఆదే ఓవర్లో ఆఖరి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా వెస్ట్ండీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సాఫారీ బౌలర్లు రబాడ(2), నింగిండి(3), బ్రోచ్(2) లైన్ అండ్ లెన్త్ బౌలింగ్‌తో పరుగుల కట్టడితో పాటు కీలక వికెట్లను పడగొట్టారు. దీంతో ఎవరూ ఊహించని రీతిలో 44 పరుగులకే టాపార్డర్ కుదేలైంది.
అయితే ఈ కష్టకాలంలో క్రీజులోకి వచ్చిన హోల్డర్, సేఫార్డ్ ఆచితూచి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. వికెట్లు పడినా..రన్ రేట్ పడిపోకుండా స్ట్రక్ రోటెంట్ చేస్తూ భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఈక్రమంలోనే 30 బంతుల్లో 49 పరుగులు చేసి హోల్డర్ చివరి ఓవర్లో రనౌటైయ్యాడు. ఆ తర్వాత సేపార్డ్ 31 బంతుల్లో అర్థ సెంచరీతో అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరు ఆటతో జట్టుకు 176 పరుగుల భారీ స్కోర్ లభించింది.



