Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏం ఎలచన్లో ఏమో పో..!

ఏం ఎలచన్లో ఏమో పో..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎం ఎలచన్లో ఏమో పో…యాడ జూసిన ఒక్కటే లొల్లి నడుస్తుందే మల్లన్న.. అవునే నర్సన్న మన కాలంలో గిసుంటి ఎలక్షన్ల లొల్లి ఉండకపోతుండే..ఎవరో ఒకరు నిలబడుతుండ్రి వాళ్లకు అందరం జై కొడుతుంటిమి.. గంతే.. ఇప్పుడు చూస్తే చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి..ఓట్లల్లా నిలబడేటోల్ల పేరు బయటపడ్డది అంటే చాలు.ఖర్చులే ఖర్చులు..నామినేషన్లు, ప్రచారానికి ర్యాలీ ర్యాలీ తీస్తుండ్రు. పొద్దుగాలన్న నాస్టలు,మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పైసలు అంటే లెక్కనే లేదు. నీళ్ల లెక్క ఖర్చు పెడుతున్నరు..

పోనీ గింత ఖర్చుపెట్టి గెలిచినంక ఊర్లకు ఏమన్నా చేస్తారా ఆంటే అదీ లేదు. ఎవరో నూటికి ఒక్కలు ఊరి కోసం ఏమన్న చేస్తారేమో గానీ అందరూ జేబులు నింపుకొనట్లే కదా. ఎవరన్న ఎట్లన్నా ఉండని మల్లన్న మనమైతే ఊరు కోసం నిలబడేటోళ్లకే ఓట్లు వేయాలి.. పొద్దు పోతుంది. పద ఇంటికి పోదాం అంటూ ముగ్గురు తాతలు ఇంటిలోవ పట్టారు. ప్రస్తుతం మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం ఉండడంతో ఎక్కడ చూసిన వయసు పైబడిన వారంతా ఇలా నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -