- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై 40 రోజుల యుద్ధంతో అమెరికా ఏమి సాధించిందని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు సిద్ధంగా ఉండాలనే షరతుపై మధ్యప్రాచ్యంలో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణలో భాగంగా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచారన్న మీడియా నివేదికలపై బుధవారం ఆయన స్పందించారు. యుద్ధ ప్రారంభం కావడానికి ముందే ఆ మార్గం ‘తెరిచి వుండటంతో పాటు స్వేచ్ఛగా అందుబాటులో’ ఉందని అన్నారు. ఈ 39 రోజుల యుద్ధం అమెరికా ఏమి సాధించిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘అన్యాయమైన యుద్ధం’ అని హ్యాష్ టాగ్ పోస్ట్ చేశారు.
- Advertisement -



