ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఈనెల 9న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే, ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్స్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించు కునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవు తుంది. వివేక్ సాగర్ బీజీఎం స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా అతిథి పాత్రలో సమంత నటించడం కూడా సినిమాకి ప్రధాన హైలెట్‌గా నిలిచింది. ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
సీరియల్స్ చూస్తూ మహిళలు వింతగా ప్రవర్తిస్తే?
- Advertisement -