Tuesday, April 29, 2025
Navatelangana
Homeతాజా వార్తలుఉపాధికి ఏఐ ఎసరు ?

ఉపాధికి ఏఐ ఎసరు ?

  • – అలాంటి భయాలు వద్దంటున్న నిపుణులు
    – మనుషులు మాత్రమే చేసే పనులూ ఉంటాయని భరోసా

    ఛాట్‌జీపీటీ, జెమిని వంటి శక్తివంతమైన కృత్రిమ మేధ (ఏఐ) సాధనాల ప్రవేశంతో మానవ అస్తిత్వమే ప్రమాదంలో పడిందా? మనం ప్రస్తుతం చేస్తున్న పనులన్నింటినీ ఏఐ చేస్తోందా? ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు ఉన్నాయి.
    న్యూఢిల్లీ : ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎక్స్‌, రెడిట్‌లో ఓ క్లిప్పింగ్‌ వైరల్‌ అవుతోంది. ఇది ’60 మినిట్స్‌’ అనే టీవీ షో నుండి వచ్చిన క్లిప్‌. అందులో ధ్యాన ముద్రలో ఉన్న రిక్‌ రూబిన్‌ ఓ రుషి మాదిరిగా కాళ్లు చాపుకొని కూర్చొని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. ఆయన ఓ సంగీత సృష్టికర్త. పరిశ్రమలో ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీరు వాయిద్యాలు వాయిస్తారా, సౌండ్‌ బోర్డుపై ఎలా పనిచేయాలో తెలుసా అని రూబిన్‌ను అడుగుతారు. దానికి ఆయన లేదు అని సమాధానం చెబుతారు. తనకు సాంకేతిక సామర్ధ్యం లేదని, సంగీతమే తెలియదని అంటారు. ఈ క్లిప్పింగ్‌ ఇటీవలి కాలంలో బాగా వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఛాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ సాధనాల గురించి ఆలోచిస్తున్న ప్రజలు సాంకేతిక నైపుణ్యం గురించి పట్టించుకోవడం లేదు. కావాల్సిన అన్ని సాంకేతికతలనూ కృత్రిమ మేధే అందిస్తోంది. ఉదాహరణకు ఇప్పటికే అది ఎన్నో కోడింగ్స్‌ చేసింది. సుమారు 30 శాతం కోడ్‌ను రాసేసింది. ఏఐ సాధనాలు గ్రాఫిక్‌ డిజైనింగ్‌, మీడియా ప్రొడక్షన్‌, బిజినెస్‌ రైటింగ్‌-కమ్యూనికేషన్స్‌, కన్సల్టింగ్‌-డేటా అనాలసిస్‌ వంటి పరిశ్రమలలో అనేక ముఖ్యమైన పనులు చేస్తున్నాయి. జావాలో కోడింగ్‌ సామర్ధ్యం వంటి సాంకేతిక నిపుణత ఇప్పటికే చౌకగా, అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఆ నైపుణ్యం అవసరమైన చోట మనుషులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఇదే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం ఉంది…అదే అనుభవాన్ని ఆస్వాదించడం. అయితే కొన్ని పరిశ్రమలలో మాత్రమే ఈ ఆస్వాదన అవసరం. మిగిలిన వాటిలో దానితో పనే లేదు. జీతాల డేటాతో స్ప్రెడ్‌షీట్‌ తయారు చేసే హెచ్‌ఆర్‌ ఉద్యోగికి ఆ అభిరుచి, ఆస్వాదన అవసరం ఏముంటుందని కొందరి ప్రశ్న. పైగా ఈ అభిరుచి, ఆస్వాదన కోసం ఏదైనా సంస్థకు వేలాది మంది ఉద్యోగుల అవసరం లేదు. కేవలం పది మందితో ఆ పనిని ముగించవచ్చు. ఆపిల్‌లో స్టీవ్‌ జాబ్స్‌ తరహాలో ఒకే ఒక వ్యక్తితో కూడా పని చేయవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఏఐ సాధనాలకు 130 ఐక్యూ ఉన్నప్పుడు అవి మనుషుల కంటే మెరుగైన పనులు చేయగలవు. ఆందోళన కలిగించే విషయమేమంటే మనుషులు మాత్రమే చేయగలిగిన పనులలో కూడా ఇప్పుడు ఏఐ ప్రవేశిస్తోంది. ఇప్పుడు డ్రైవర్‌ అవసరమే లేని కార్లు రోడ్ల పైకి వచ్చాయి. గూగుల్‌కు చెందిన క్యాబ్‌ సర్వీస్‌ ‘వేమో’ ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ప్రతి నెలా పది లక్షల డ్రైవర్‌ లెస్‌ రైడ్లు చేస్తోంది. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఇక్కడ ఊరట కలిగించే విషయం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించే ఉద్యోగాలు ఇప్పటికీ ఉన్నాయి. కోవిడ్‌ మహమ్మారి ఎంత నష్టాన్ని కలిగించినప్పటికీ అది ప్రపంచం గురించి అనేక సత్యాలను బయటపెట్టింది. అనేక దేశాలలో లాక్‌డౌన్‌లు ప్రకటించినప్పుడు కార్యాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. అయినప్పటికీ వారు తమ పనులు ఆపలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో పనులు మానేసినప్పటికీ ప్రపంచం ఏమీ ఆగిపోదు. అది మామూలుగానే తన పని తాను చేసుకుపోతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా జీవనాధారం ఉంటూనే ఉంటుంది. ఉద్యోగాలను సృష్టించింది మానవులే. ప్రభుత్వ రంగమైనా లేక ప్రైవేటు రంగమైనా ఉద్యోగాలను సంపద పున్ణపంపిణీకి పాలకులు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలలో చాలా వరకూ పని లేదా ఉత్పాదకతకు సంబంధించినవి కావు. అందువల్ల వీటిని ఏఐ సాధనాలు ఎలా చేస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి మనుషులు మాత్రమే చేసే ఉద్యోగాలు కచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తే మనుషులు మరిన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు. ఏఐ ఉన్నా లేకున్నా మనుషులకు మాత్రం పని ఉంటూనే ఉంటుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు