నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల కేంద్రం పలు మార్గాలతో పాటు అధికార భవన్‌ల పేర్లు మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి రోడ్డును కర్తవ్యపథ్‌గా, రాజ్‌భవన్ ను లోక్ భనన్‌గా, ప్రధాన మంత్రి కార్యాయాన్ని సేవాతీర్థ్‌గా పేర్లు మార్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ పథకానికి పేరు మార్పు వల్ల మోడీ సర్కార్ కు వచ్చే లాభమేంటని ప్రశ్నించింది. ఉపాధి హామీ పథకం లబ్దిదారులు నష్టపోతారని, దానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, వస్తువులపై ఇప్పటికే ముద్రించిన పేరు మార్చాల్సి వస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.



