Thursday, November 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన నష్టమేమిటి? : సీఎం రేవంత్ రెడ్డి

అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన నష్టమేమిటి? : సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వచ్చిన నష్టమేమిటి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా షేక్‌పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. నియోజకవర్గంలో రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరితే ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తినని అన్నారు. కొడంగల్‌లో నా మూడుసార్లు గెలుపు వెనుక మైనారిటీల సహకారం ఎంతో ఉందని తెలిపారు.

ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే… వారిద్దరూ ముస్లింలను మోసం చేస్తున్నారని అన్నారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -