నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇంతటి ప్రజాదరణ పొందిన యాప్ గురించి యూజర్లకు ఓ బిగ్ అలర్ట్. మే 5వ తేదీ తర్వాత నుంచి పలు ఫోన్లలో ఈ యాప్ పనిచేయదు. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం iOS యూజర్లకు మాత్రమే వాట్సాప్ సపోర్టు నిలిపివేయనుంది. మరీ ఏ ఏ ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదో తెలుసుకుందామా?
మెటా సంస్థ యూజర్ల సౌలభ్యం కోసం, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గానూ.. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో భాగంగా వాట్సాప్‌ను వాడే ఫోన్ల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా పాత ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఐఫోన్లలో తమ సేవలను నిలిపివేయనుంది. అంటే.. 15.1 కన్నా ముందు iOS వెర్షన్‌లు రన్ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇందులో ఐఫోన్ 5s, 6, ఐఫోన్ 6 ప్లస్ ఉన్నాయి. ఈ మోడళ్లు iOS 12.5.7 వరకు మాత్రమే అప్‌డేట్ చేయగలవు. ఈనెల 5 తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ , నోటిఫికేషన్‌లు ఎలాంటి సేవలు పనిచేయవు. కాగా, యాపిల్ సంస్థ ఈ ఐఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందించటం ఆపేసింది. తద్వారా భద్రతా లోపాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
5వ తేదీ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
- Advertisement -
RELATED ARTICLES