నవతెలంగాణ-రాయికల్
పట్టణ కేంద్రం నుండి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే తారు రహదారులు గతంలో కురిసిన వర్షాలు,వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.రోడ్లపై గుంతలు, చీలికలు,మట్టి గడ్డలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కానీ సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం ప్రమాద సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఇరువైపులా కోతలతో ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు రోడ్లను కప్పేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు సంభవించే పరిస్థితి నెలకొంది.ప్రజలు రోడ్ల మరమ్మత్తు కోసం స్థానిక నాయకులు, అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సౌకర్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఆర్ అండ్ బి అధికారులపై చర్యలు తీసుకుని వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
రోడ్లకు మరమ్మతులు చేసేది ఎప్పుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



