నవతెలంగాణ – హైదరాబాద్: ‘ఒకే తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవాళ్లం. ఈరోజు మా కోటన్న నాకు చెప్పకుండానే వెళ్లిపోయాడు’ అంటూ బాబూమోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన బాబూ మోహన్.. నిర్జీవంగా ఉన్న కోటని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న ఇకలేడంటూ బోరున విలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
‘ఇది చాలా దురదృష్టకరమైన రోజు. కోటన్న నాకెంతో ఆత్మీయుడు. ఇద్దరం కలిసి సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంతో సరదాగా ఉండేవాళ్లం. రెండ్రోజుల క్రితమే ఫోన్ చేసి మాట్లాడా. ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా. నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు. ఇంటికి ఎప్పుడు వెళ్లినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఆయనకు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములున్నా నన్ను సొంత తమ్ముడిలా భావించేవాడు. ఏ ఊరికి షూటింగ్‌కి వెళ్లినా పక్క పక్క గదుల్లోనే ఉండేవాళ్లం. షూటింగ్ ఉన్నప్పుడు భోజనం సమయంలో నాకు అన్నం కలిపి తినిపించేవాడు. ఇలాంటి జ్ఞాపకాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో కోటన్న నాకెంతో అండగా నిలబడ్డాడు. తాను ఎక్కడున్నా ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. రెండ్రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ఇంటికొస్తా అని చెప్పాను. ఈలోగా నాకు చెప్పకుండానే పైలోకాలకు వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయా. అలాంటి మంచి మనిషి, గొప్ప నటుడు మళ్లీ దొరకడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు బాబూమోహన్.
Babu Mohan: నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES