Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల జోలికొస్తే ఖబడ్ధార్..

బీసీల జోలికొస్తే ఖబడ్ధార్..

- Advertisement -

– బీసీల ద్రోహి కోమటిరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించాలి
– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
నవతెలంగాణ –  కామారెడ్డి : బీసీల జోలికి ఎవరు వచ్చిన సహించేది లేదని, బీసీల ద్రోహి కోమటిరెడ్డి మంత్రివర్గం నుండి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలను అడుగడుగునా అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని, ధెబ్బతీస్తు బీసీల ద్రోహిగా మారి, కులగజ్జితో వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను తొలగించి,రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం చూస్తే బీసీలపై ఆయనకు బిసిల పట్ల పచ్చి వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతుందని అన్నారు.  పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియమాకం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగనన జరగడం, కాంగ్రెస్ పార్టీ పదవుల నియామకాలు 70 శాతం బహుజనులకు కేటాయించడం, డిసిసి అధ్యక్షులు నియామకాలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం, ఎమ్మెల్సీ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు కేటాయించడం, నిన్న మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో బీసీలు పెద్ద ఎత్తున గెలవడంతో, ఇది జీర్ణించుకోలేని కోమటిరెడ్డి,  పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తొలగిస్తే రెడ్డి రాజ్యం కు అడ్డు ఉండదని ఉద్దేశంతో కోమటిరెడ్డి బలుపెక్కిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానo, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డిని మంచి వర్గం నుండి తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బిసిలంత పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో సాయి విగ్నేష్, రాజ్ కుమారు, మణిరాజ్, సుమన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -