Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

- Advertisement -

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలంలోని ఎలగందుల రాజ్యలక్ష్మి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టంగుటూరులో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం రమాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలు, బాధ్యతలు విద్యార్థులకు అర్థం కావాలనే ఉద్దేశంతో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.విద్యార్థులు ఒక రోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా వారికి ప్రత్యేకమైన అనుభవం లభిస్తుందని, ఇది వారి జీవితంలో తీపి జ్ఞాపకంగా నిలుస్తుందని చెప్పారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పాఠశాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

స్వపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేగా చరన్, కలెక్టర్గా ప్రశాంత్, డీఈఓగా ఈశ్వర్, హెచ్‌ఎంగా శ్వేత, సర్పంచిగా గ్రీష్మిత, ఎస్‌ఎంసీ చైర్మన్‌గా చందు విద్యార్థులు వ్యవహరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు.అనంతరం విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, శ్రీనివాస్,కుమారస్వామి,వెంకటేష్,ఖాజా అలీ, జయశ్రీ,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -