Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeకవితఈ నరక జ్వాలలు ఆరే దెప్పుడు...?

ఈ నరక జ్వాలలు ఆరే దెప్పుడు…?

- Advertisement -

ఇది మానవత్వం
రాక్షసత్వమై కబళిస్తున్న
విషాద సందర్భం……
లక్షలాది ప్రాణాలను
మత్యువధ్యస్థలానికి బలి యిచ్చి
చరిత్ర పుటలలో రక్తాక్షరమరకల ను
శాశ్వతంగా ముద్రించు కుంటున్నాడు
హిట్లర్‌ కావాలన్నకోరి%ఙ%కకు
నిత్యం ఊపిరులూదుతూ
తన కలలను సాకారం చేసు కుంటూ,
అధికారదుర్వినియొగం,అవినీతిలో ఓలలాడుతూ
తన మెడలోచెప్పుల దండలు వేయకుండా
మసి పూసి మారేడు కాయను చేస్తూ
స్వజనం దష్టికి గంతలు కట్టుతూ
వారి ఆలోచనా స్రవంతిని దారిమళ్ళించడానికి
ఉగ్రవాదాన్ని అంతమొందించడం
అన్న నెపం తో
అక్కడ నెత్తురుటేరులు పారిస్తున్నాడు
జాతి హననం,మానవత్వ సంక్షోభం
సష్టించడానికి అర్రులు చాస్తున్నాడు
ఇతర ప్రదేశాలనుండి యుధ్ధ బాదితులకు
జీవనాధారమైన అహారం అందకుండా
ఆ ఆహార శకటాలను భస్మీపటలం చేస్తున్నాడు
ఎముకలకు చర్మం అతుక్కు పోయి
ఎండిన డొక్కలతో ఆకలితో అలమటిస్తున్న
చిక్కిశల్యమైన జవఛ్ఛవాల
ఆకలికి కఊరంగా బుల్లెట్లను తినిపిస్తున్నాడు
మత్యు వొడిలో సేదతీరుతున్న తమ వారికోసం అల్లల్లడుతూ
అగమ్య గోచరంగా దిక్కులు చూస్తున్న
అసంఖ్యాక ఆడవాళ్ళను,
తమవారిని కోల్పోయి అనాథలుగా మిగిలిన భావి పౌరులైన
పసిమొగ్గలను కూడా విచక్షణారహితంగా
తన కర్కశ మత్యువాంఛా కుటారంతో
ముక్కలు ముక్కలుగా నరికి
తన రక్త దాహం తీర్చుకుంటున్నాడు
ఇంకా కొన ఊపిరితో కూడా ఉండ కూడదని
బాంబుల్ని శ్వాసించమని, ఊపిరి పోసుకుంటున్న
స్వేఛ్ఛా వాంఛకు మరణ శాసనం
లిఖిస్తున్నాడు
స్వతంత్ర దేశంగా అవతరించాఈన్న ఆశా జ్యోతుల్ని
చీకటి తుఫానై విరుచుకు పడ్తూ
నిర్దాక్షిణ్యంగా ఆర్పేస్తున్నాదు
యుధ్ద జ్వాలలు ఆర్పక పోతే నిరంతరం
అగ్నిగుండమై తనతో సహా విశ్వమంతటినీ
కాల్చి భస్మం చేస్తుందని గ్రహించలేక పోతున్నాడు
– డాక్టర్‌ దిలావర్‌,

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad