నవతెలంగాణ-హైదరాబాద్: ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి డెలివరీని ప్రారంభించింది. టెస్లా జూలై 15న తన ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV, టెస్లా మోడల్ Yని విడుదల చేయడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షలు. జూలై 15న ప్రారంభించబడిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ‘టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్’లో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ వైట్ కలర్ మోడల్ Y కారును డెలివరీ తీసుకుంటున్నట్లు వార్తా సంస్థ ANI వీడియో షేర్ చేసింది.
టెస్లా మోడల్ Y భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏకైక మోడల్. కస్టమర్లు టెస్లా మోడల్ Y ని దాని అధికారిక ఇండియా పోర్టల్ ద్వారా లేదా ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2025 మూడవ త్రైమాసికంలో మోడల్ Y కోసం హ్యాండ్‌ఓవర్‌లు జరుగుతాయని భావిస్తున్నారు.