-గెలుపు గుర్రాల కోసం అన్వేషణ
-వేడెక్కిన ‘పంచాయతీ’ రాజకీయం
నవతెలంగాణ-మల్హర్ రావు
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ఈ నెల 27న నోటిఫికేషన్ జారీ కాగా, తొలివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.పార్టీ ఎన్నికలు కానప్పటికీ సర్పంచులు భవిష్యత్ రాజకీయాల్లో పార్టీ బలోపేతంలో కీలకం కానున్నారు.దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపాలని భావిస్తున్నాయి. అలాగే, ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తే ఆర్థిక వెసులుబాటు కలగనుండటంతో పాటు విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆశావహులు ముఖ్య నాయకుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండటంతో పోటీలో ఎవరిని నిలిపితే బాగుంటుంది.గెలిచే అవకాశాలు ఎవరికున్నాయనే దిశగా పార్జీలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. ఇందుకు గ్రామాలు, సామాజికవర్గాల వారీగా పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల బల బలాలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డాయి. దీంతోపల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు రెండేళ్ల వుతోంది. పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నుంచి పంచాయతీలకు అందాల్సిన ఎస్ఎఫ్ సీ, ఎఫ్ఎ ఫీసీ నిధులు పూర్తిగా నిలిచాయి. కొత్తపా లకవర్గాలు కొలువుదీరాక పంచాయతీలకు పెద్ద ఎ త్తున నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఈసారి సర్పంచ్ గా బరిలో నిలిచేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.
ఎవరిని నిలబెడుదాం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


