– చామల కిరణ్ కుమార్ రెడ్డి
– ఎర్రకోట ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు
– ఆర్ఎస్ఎస్ తివర్న పతాకం ఎగరవేయలేదు
– గుజరాత్ కే ప్రధాని మోడీ
-బిజెపి ఎంపీలను మరిచారు
నవతెలంగాణ – ఆలేరు : దేశ 79 స్వతంత్ర ఉత్సవాలు జరుగుతున్న ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ గురించి గొప్పలు చెప్పడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.శుక్రవారం ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం నవ తెలంగాణతో బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ నాడు ప్రధాని మోడీ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం పేదరికం టెర్రరిజం ట్రంపు సుంకాలు గూర్చి మాట్లాడకుండా ఆర్ ఎస్ ఎస్ వందేళ్లుగా దేశ సమగ్రతకు పాటుపడిందని అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా ఆర్ ఎస్ ఎస్ బ్రిటిష్ వారికి దాసోహం అన్న విషయం చరిత్ర పుటల్లో వెతికితే కనిపిస్తుంది అన్నారు. ఎర్రకోట ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదన్నారు. కుల మత ప్రాంతీయ రాజకీయ పార్టీల అందరికీ సంబంధించిన ఎర్రకోట గౌరవప్రదమైన ప్రదేశమని మోడీ కంటే ముందు ప్రధానులు ఇలా ఎవరు మాట్లాడలేదన్నారు. స్వాతంత్రం వచ్చిన 52 సంవత్సరాలు నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన ఏనాడు త్రివర్ణ పతాకం ఎగరవేయని చరిత్ర ఆర్ ఎస్ ఎస్ కు ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి గొప్పలు చెప్పుకోవాలి అనుకుంటే బీజేపీ కార్యాలయంలో చెప్పుకోవాలన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రధాని మోడీ తాను ఇంకా గుజరాత్ సీఎం గానే వ్యవహరిస్తున్నారని తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన సెమీ కండక్టర్ కంపెనీలను గుజరాత్ రాష్ట్రానికి తరలించుకు వెళ్లాడని ఆరోపించారు ఈటీవీ గల మరొక కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి సెమీ కండక్టర్ కంపెనీ వస్తే తన ఆంధ్రప్రదేశ్లోని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని సంతృప్తి పరచేందుకు ఆ కంపెని అక్కడ పెట్టాలని లేకుంటే అనుమతులు ఇవ్వమని ఒత్తిడి తెస్తున్న విషయం నిజం కాదా తెలపాలన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా ఆ రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న విషయం కూడా మరిచారా అంటూ ప్రశ్నించారు. బిజెపికి బీ టింగా ఉన్న బిఆర్ఎస్ గత పది సంవత్సరాల పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన కెసిఆర్ పై ఎలాంటి కేసులు పెట్టలేదు ఎందుకన్నారు. ప్రధాని పదే పదే మాట్లాడే వికసిత్ భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ల ఎకానమీగా భారత దేశాన్ని మారుస్తాం అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు ట్రిలియన్ల ఎకానమీ కోసం చేస్తున్న ప్రయత్నానికి ప్రధాని మోడీ సహకారం కరువైందన్నారు. రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మర్చిపోయి నిధులు ఇవ్వాలని మోడీని అమిత్షాలను ఒప్పించలేకపోవడం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని సమయం వచ్చినప్పుడు సరైన తీర్పిస్తారని చెప్పారు.
ఎర్రకోట వద్ద ఆర్ ఎస్ ఎస్ గొప్పలు ఎందుకు ప్రధాని..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES