జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఇందిరా మహిళా శక్తి పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై జిల్లాలోని వివిధ మండలాలో, గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు ఇందిరా మహిళ శక్తి పథకం చేపట్టి మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రతి మహిళ వివిధ వ్యాపార రంగాలలో సాధికారిత సాధించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
బస్సులు, పెట్రోల్ బంకులు,హోటళ్లు, మహిళ క్యాంటీన్లు వంటి వ్యాపార రంగాలలో భాగస్వాములుగా రాణిస్తున్నట్లు తెలియజేస్తూ, మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందిర మహిళా శక్తి పథకాలను వినియోగించుకునేలా సమాచారాన్ని గ్రామ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకాలకై విస్తృత ప్రచారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES