నవతెలంగాణ-హైదరాబాద్ : పదకొండేళ్ల క్రితం ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె భర్తకు భారీ నష్టపరిహారం దక్కింది. ప్రమాదానికి కారణమైన వాహనాల యజమానులు మృతురాలి భర్తకు రూ.51.73 లక్షలు పరిహారంగా చెల్లించాలని ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2014 ఆగస్టు 19న ప్రతిక్షా డిసౌజా అనే మహిళ, తన భర్త బ్రియాన్ డిసౌజాతో కలిసి ఆటోలో ప్రయాణించింది. ఆ సమయంలో రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఆటో డ్రైవర్ వేగంగా ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆగివున్న ట్రక్కు వెనుకాల ఆటోను సడెన్‌గా కుడివైపునకు తిప్పడంతో వెనుకనే వేగంగా వస్తున్న మరో ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రతీక్షా డిసౌజా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై సంపూర్ణ విచారణ జరిపిన ట్రిబ్యునల్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మూడు వాహనాల యజమానులు, డ్రైవర్‌లు ఈ జరిమానాలు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.