నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో ముగ్గురు పిల్లలను ఓ తండ్రి హతమార్చాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళ నాడు రాష్ట్రం తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్, నిత్య అనే దంపతులు నివసి స్తున్నారు. వీరికి ఓవియా (12), కీర్తి (8) అనే కుమార్తెలు, ఈశ్వరన్ (5) అనే కుమారుడు ఉన్నారు. ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూర్ జిల్లా మన్నార్ గుడికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.
ఆరునెలల ముందు నిత్య భర్త, పిల్లలను విడిచిపెట్టి ఆ యువకుడితో వెళ్లిపోయింది. అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకుని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియుడిని విడిచిపెట్టి రమ్మని కోరాడు. కానీ ఆమె తన తిరిగి రాలేదు. దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు. శుక్ర వారం సాయంత్రం తన ఇంట్లో ఓ గదిలో పిల్లలు ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు పిల్లలు స్వీట్లు తింటుండగానే కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.