Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏ పార్టీలో చేరాలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా : రాజాసింగ్

ఏ పార్టీలో చేరాలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా : రాజాసింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన విడుదల చేశారు. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. 11 ఏళ్లుగా బీజేపీలో కొనసాగాను. నన్ను నమ్మి పార్టీ మూడుసార్లు టికెట్ ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకూ హిందూత్వం, సనాతనధర్మం, జాతీయ వాదం కోసం పనిచేస్తా’ అని రాజాసింగ్ ప్రకటన చేశారు.

అయితే.. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపైనా రాజాసింగ్ స్పందించారు. దీనిపై మరో వీడియో రిలీజ్ చేశారు. ‘రాజీనామా ఆమోదంపై కార్యకర్తలు బాధపడొద్దు. నా రాజీనామా కారణాలను అధిష్ఠానం పరిశీలించలేదు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేకపోయాను. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరుతానని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు. త్వరలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా’ అని రాజాసింగ్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -