- Advertisement -
నవతెలంగాణ వాషింగ్టన్: చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. మరో నాలుగు వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తాను భేటీ అవుతానని వెల్లడించారు. సోయాబీన్ ఎగుమతుల పైనే ప్రధానంగా తమ చర్చ సాగుతుందని పేర్కొన్నారు.
”మా సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల మా దేశంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి సాయం చేసేందుకు మేం వసూలు చేస్తున్న టారిఫ్‌లలో కొంతమొత్తం రైతులకు అందజేస్తాం ఇక, నాలుగు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేను సమావేశం కానున్నా. ఆ భేటీలో సోయాబీన్ ఎగుమతుల గురించే ప్రధానంగా చర్చ ఉంటుంది’’ అని ట్రంప్ తన ట్రూత్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
- Advertisement -