నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజ్యసభకు పోటీ చేయడం లేదని చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన పదవీకాలం ముగియనున్నది. మధ్యప్రదేశ్ సీఎంగా ఆయన రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1993 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా చేశారు.2003లో ఓడి పోయిన తర్వాత రాజకీయాలకు దిగ్విజయ్ స్వస్తి పలికారు. పదేళ్ల తర్వాత ఆయన రాజ్యసభలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యసభను వదిలేది నా చేతుల్లో లేదని, కానీ తన రాజ్యసభ సీటును ఖాళీ చేస్తున్నానని ఓ జాతీయ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు దిగ్విజయ్ సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాదిలో రాజ్యసభలో 73 సీట్లు ఖాళీ కానున్నాయి. పెద్దల సభలో కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకుల పదవీ కాలం ముగియనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్(నామినేటెడ్ ఎంపీ) టర్మ్‌లు ముగిన్నాయి.అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు.. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్‌లో రెండు విడతలలో జరిగే అవకాశం ఉంది.



