నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌తో చర్చించడానికి ఒకే విషయం మిగిలి ఉందని, అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) అంశం మాత్రమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం వహించడాన్ని భారత్ ఎప్పటికీ ఒప్పుకోబోదని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపైనే డిస్కషన్ ఉంటుందని ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ.. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
కశ్మీర్ అంశంపై మూడో పక్షం జోక్యం సహించం: జైశంకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES