Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం మోడీకి ‘నరవాణే’ రాసిన బుక్ అంద‌జేస్తా: రాహుల్ గాంధీ

పీఎం మోడీకి ‘నరవాణే’ రాసిన బుక్ అంద‌జేస్తా: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ రాసిన పుస్త‌కాన్ని పీఎం మోడీకి ప్ర‌దానం చేస్తాన‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ అన్నారు. పార్ల‌మెంట్‌లో దేశ భ‌ద్ర‌త గురించి మాట్లాడేందు బీజేపీ స‌ర్కార్ భ‌య‌ప‌డుతుంద‌ని ఆరోపించారు. 2020లో చైనాతో సరిహ‌ద్దు వివాద స‌మ‌యంలో ఆర్మీని ఒంట‌రీగా బీజేపీ స‌ర్కార్ ఎలా వ‌దిలేసిందో మోడీజీ తెలుసుకుంటార‌ని బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా ఎద్దేవా చేశారు.

ఈ రోజు పార్ల‌మెంట్‌కు ప్ర‌ధాని మోడీ వ‌స్తే ఆయ‌న మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ న‌ర‌వణే రాసిన పుస్త‌కాన్ని అంద‌జేస్తాన‌ని, ఈ బుక్ ప్ర‌తిప‌క్ష వ్య‌క్తులు, విదేశాల‌కు చెందిన రైట‌ర్ రాసింది కాద‌ని, స‌దురు బుక్ ర‌చ‌యిత‌ భార‌త్ కు చెందిన మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ రాసిన పుస్త‌క‌మ‌ని చెప్పారు. కానీ ఈ బుక్‌ తెలిపిన అంశాల‌ను కేంద్ర మంత్రివ‌ర్గం అంగీక‌రించ‌డంలేద‌ని, స‌దురు పుస్త‌కం ఉనికిలో లేద‌ని వింతండ వాదం చేస్తున్నార‌ని రాహుల్ మండిప‌డ్డారు.

చైనాకు చెందిన యుద్ధ ట్యాంక‌ర్లు భార‌త్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన స‌మ‌యంలో..బీజేపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం కోసం ఆర్మీ అధికారులు వేచి చూడ‌గా..మీకు ఏది అనిపిస్తే అదే చేయాల‌ని నిర్ల‌క్ష్యంగా సమాధానం ఇచ్చారని, అలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆర్మీని ఒంట‌రీగా వ‌దిలేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో ఆర్మీకి అండ‌గా ఉండాల్సి పోయి జ‌వాన్లు ప్రాణాల‌తో చెల‌గాటం ఆడార‌ని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -