Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుగ్రామాభివృద్ధికి తోడ్పాటున అందిస్తా..

గ్రామాభివృద్ధికి తోడ్పాటున అందిస్తా..

- Advertisement -


వెల్దండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్..
నవతెలంగాణ వెల్దండ
వెల్దండ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు తోడ్పాటునందిస్తానని వెల్దండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మట్ట యాదమ్మ వెంకట గౌడ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని చొక్కనపెల్లి గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కనపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. అనంతరం వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ తదితర గ్రామ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సర్పంచిగా అవకాశం ఇస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎలాంటి ఆపద వచ్చిన ముందుండి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రషీద్, పురుషోత్తం, హమీద్, కృష్ణ ముదిరాజ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -