నవతెలంగాణ – మద్నూర్
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రతి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు ఇవ్వగా మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా గైరాజా గానే కనిపిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్థానికంగా తాసిల్దార్ లేకపోయినప్పటికీ ఆర్ ఐ శంకర్ సమక్షంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరోగ్యశాఖ, ఐకెపి, శాఖ ఈ రెండు శాఖలు తప్ప మిగతా శాఖలన్నీ గైరాజా గానే ఖాళీ కుర్చీలో దర్శనమిచ్చాయి. అధికారుల పనితీరు ఇలా ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదేలా అనే చర్చలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గౌరగా ఉన్న ఎందుకు పట్టింపు లేదు అనే వాదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే విధంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా గైరాజార్ గా ఉండడం ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజల్లో చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల గైరాజార్ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గైరాజన్ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదేలా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES