Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమృతురాలి బంధువులు రాస్తారోకో..

మృతురాలి బంధువులు రాస్తారోకో..

- Advertisement -

– నిలిచిపోయిన రాకపోకలు
– పోలీస్ వాహనంలో మృతురాలి భర్త బంధువు 
– పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తిత
– పెద్దలు సర్ది చెప్పడంతో నిలిపిన నిరసన 
నవతెలంగాణ – అశ్వారావుపేట : అనుమానాస్పద స్థితిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన లక్ష్మి ప్రసన్న బంధువులు సోమవారం పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేసారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మృతురాలి గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సర్ది చెప్పడంతో నిరసన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమండ్రి నుండి అశ్వారావుపేట కు అంబులెన్స్ లో మృతదేహం తరలిస్తున్న విషయం తెలుసుకున్న మృతురాలు బంధువులు అధికసంఖ్యలో చేరుకున్నారు. ఇందులో కొందరు యువకులు స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలిలో అంబులెన్స్ నిలిపి అందులో ఉన్న మృతురాలి భర్త నరేష్ బాబుపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ లు వారించినా ఆగకుండా భౌతిక దాడి చేసారు.

దీంతో మృతురాలి భర్త నరేష్ బాబు బావ దాసరి శ్రీను పోలీస్ వాహనంలోకి రావడంతో ఈ దృశ్యాన్ని గమనించిన మృతురాలు బంధువులు ఒక్క సారిగా ఉద్వేగానికి గురై నిందితుడుగా ఉన్న వ్యక్తి బంధువు పోలీస్ వాహనం నడపడం ఏమిటి అంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తిత చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ రెండేళ్లు గా గృహంలో నిర్భందించి,హింసించి చంపారని ఆమె తల్లిదండ్రుల వాపోయారు. లక్ష్మీప్రసన్న ను అదనపు కట్నం కోసం నరేష్ బాబు,అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూ లక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించే వారని ఆరోపించారు. రెండేళ్ల నుంచి మాట్లాడనివ్వలేదు వివాహ సమయంలో రెండెకరాల మామిడితోట, అర ఎకరం పొలం తో పాటు రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చాం.అశ్వారావుపేట కు వెళ్లిన ఏడాదిపాటు తమ కుమార్తె మాట్లాడేది.రెండేళ్ల నుంచి ఆమెను చూపించలేదు, ఫోన్‌ చేసినా మాట్లాడనివ్వలేదు.మేము వెళ్లినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారు.ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపేశారు’ అని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు.నరేశ్‌బాబు బావ మాత్రం.. లక్ష్మీప్రసన్నకు రక్తహీనత, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నాయని, ఆమెను తల్లిదండ్రులకు చూపించ లేదనడం అవాస్తవమని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad