Friday, November 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంత్వరలో భారత పర్యటనకు వస్తా..మోడీ నాకు గొప్ప స్నేహితుడు: ట్రంప్‌

త్వరలో భారత పర్యటనకు వస్తా..మోడీ నాకు గొప్ప స్నేహితుడు: ట్రంప్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై స్వయంగా హింట్ ఇచ్చిన ట్రంప్‌.. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి సంబంధించి కొత్త ఒప్పందాన్ని ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. ‘మోడీ రష్యా నుంచి చమురు కొనడం చాలావరకు మానేశారు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేను అక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. మేము దాన్ని పరిశీలిస్తున్నాం. నేను వెళ్తాను. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి’ అని ట్రంప్‌ అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించాలని మీరు ప్లాన్‌ చేస్తున్నారా? అని ఓ విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘అలా కావొచ్చు. అవును’ అని పేర్కొన్నారు. కాగా.. ట్రంప్‌ పర్యటనపై వైట్‌హౌస్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -