Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట : మారేపల్లి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి నేరాలపల్లి మనోహర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్న మనోహర్ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అందరికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ ముందుకు సాగుతానని అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని తన గెలుపు కోసం కృషి చేయాలని గ్రామస్తులను శ్రేయోభిలాషులను కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరూ తనను ఆశీర్వదించాలని గ్రామ ఓటర్లను కోరారు.

గత ఐదు సంవత్సరాలుగా గ్రామంలో సేవ చేస్తున్నానని ఎవరైనా అకాల మరణం చెందితే 5వేల రూపాయలు బీద మహిళలకు చీరలు స్కూలు విద్యార్థులకు బ్యాగులు అందిస్తూ సామాజిక సేవ చేస్తున్నాను. అలాగే గెలిచిన తర్వాత మినీ అంబులెన్స్ గ్రామపంచాయతీకి ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న దాన్ని ఉచితంగా వాడుకోవచ్చు అన్నారు అలాగే ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో వైద్య శిబిరం చేస్తానని గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తానని అన్నారు. అలాగే గ్రామంలో ఐమాక్స్ లైట్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలందించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -