నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణతో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కుదటపడిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితులపై మరోసారి అమెరికా ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య కోసం ఇరు దేశాలతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ఇరుదేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాయన్నారు. భారత్-పాక్ దేశాల మధ్య చరిత్రాత్మక కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా సహాయపడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, కశ్మీర్ విషయలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES