Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదవ రోజు కొనసాగుతున్న శిక్షణా శిబిరాన్ని సందర్శించిన విలియం

ఐదవ రోజు కొనసాగుతున్న శిక్షణా శిబిరాన్ని సందర్శించిన విలియం

- Advertisement -

– కల్వకుర్తిలో కొనసాగుతున్న కోకో జిల్లా టీం శిక్షణ
నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలలో పాల్గొని జిల్లా స్థాయి కోకో జట్టుకు నిర్వహిస్తున్న శిక్షణ కల్వకుర్తి పట్టణంలో కొనసాగుతుంది. ఈ శిక్షణ శిబిరాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి విలియం గురువారం సందర్శించి క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటేందుకు విద్యార్థులు అందరూ నైపుణ్యం సాధించాలని కోరారు. వచ్చేనెల 7న పెద్దపల్లిలో జరిగే స్టేట్ మీట్ క్రీడాకారులు నైపుణ్యం కనపర్చి ఓల్డ్ మెడల్ సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు వ్యాయామ ఉపాధ్యాయులు పురణ్ చంద్ , ప్రకాష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -