నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనం వరుణుడు ఉపశమనం కలిగించినప్పటికీ, భారీ ఈదురు గాలులు భయాందోళనకు గురిచేశాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై,కారు చీకట్లు కమ్ముకున్నాయి.” మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రం 2 గంటలు అయ్యేసరికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. చూస్తుండగానే ఆకాశం కారు మేఘాలతో నిండిపోయింది.అతి వేగంతో వీచిన భారీ ఈదురు గాలుల ధాటికి అశ్వారావుపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గాలుల ధాటికి రహదారులపై చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.పట్టణంలో పలు చోట్ల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు గాలికి శిధిలం అయ్యాయి. రెండు గంటలు పాటు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.ఈ వర్షం, గాలి వానతో మామిడి,జీడి మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణం ఇలా మారడంతో నష్టం వాటిల్లుతుందేమోనని ఆవేదన చెందుతున్నారు.
గాలి వాన బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



